Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రేవంత్ ఎక్కడున్నారో తెలియడంలేదు... ఏసీబీ తీరు సరికాదు: న్యాయవాదుల ఆందోళన

ఓటుకు నోటు వ్యవహారంలో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని ఏసీబీ కస్టడీలోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే, రేవంత్ ను ఆయన న్యాయవాదుల సమక్షంలోనే విచారించాలని కోర్టు ఏసీబీకి స్పష్టం చేసింది. అయితే, ఏసీబీ అధికారులు ఈ ఉదయం రేవంత్ ను అదుపులోకి తీసుకున్నారని, దీనిపై తమకు ఎలాంటి సమాచారం అందించలేదని రేవంత్ న్యాయవాదులు నిరసనకు దిగారు. హైదరాబాదు ఏసీబీ కార్యాలయం ఎదుట వారు ఆందోళన చేపట్టారు. రేవంత్ రెడ్డిని ఎక్కడికి తరలించారో చెప్పాలని డిమాండ్ చేశారు.

More Telugu News